లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి నూతన ఎస్సైగా మోదుగు భరత్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ దూదిమెట్ల నరేష్ యాదవ్ వేలేరుకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో జనగామ నుండి భరత్ ఇక్కడికి వచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎస్సై భరత్ అన్నారు.
