
జనగామ లీడ్స్ న్యూస్: నేషనల్ హైవేలోని టోల్ చార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. ఈ మేరకు ఎన్ఎహెచ్ఏఐ,కోమల్ల టోల్ మేనేజర్ వెంకట్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన ధరలు రేపు అర్ధరాత్రి అంటే ఈ నెల 27 తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గతంతో పోలిస్తే రేపటి నుండి రూ. 5 పెరగనున్నాయి. ఇప్పటివరకు కార్లకు సింగిల్ ట్రిప్ రూ.125, రిటర్న్ జర్నీ రూ.185గా ఉన్న చార్జీలు రూ.5 మేర్ పెరిగి సింగల్ ట్రిప్ రూ. 130, రిటర్న్ జర్నీ రూ. 190 కానుంది. ఇదే స్థాయిలో మిగతా కమర్షియల్ వాహనాల చార్జీలు కూడా పెరగనున్నాయి. అన్ని రకాల వాహనదారులు పెరగనున్న రేట్లును గమనించి టోల్ మేనేజ్మెంట్ తో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత,కొత్త రేట్ల జాబితాను ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. అయితే జనగామ ఆర్టిఏ పరిధిలోని వాహనదారులు కన్సిషన్ పాసులను తీసుకొని రూ. 50 శాతం సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

