Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedజనాభా గణన సమర్థవంతంగాచేపట్టాలి

జనాభా గణన సమర్థవంతంగాచేపట్టాలి

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్) : జనాభా గణన సమర్థవంతంగా చేపట్టాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గణన ప్రభుత్వ పథకాల అమలుకు కీలకం కానుదని దీన్ని సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. జనాభా లెక్కింపు రెండు దశలుగా ఉంటుందని, మొదటి దశలో ఇళ్ల జాబితా,ఇది మే 11వ తేదీ నుంచి జూన్ 9వ వరకు, రెండో దశ 2027 ఫిబ్రవరిలో చేపట్టనున్నట్లు చెప్పారు. మార్చి ఒకటి 2027ను పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ పద్దతిలో ఈ సర్వే నిర్వహించ బోతున్నట్లు చెప్పారు. మొదటి దశలో ఇంటి నిర్మాణా తీరు, పెంకుటిల్లు లేదా ఆర్ సిసి నా? ఇంటి పరిస్థితి,కుటుంబ యజమాని వృత్తి తాగునీటి సౌకర్యం,మురుగు,నీటి పారుదల వ్యవస్థ,మరుగుదొడ్ల లభ్యత,వంట గది సౌకర్యం వంటి వాటితో పాటు టెలివిజన్, స్మార్ట్‌ ఫోన్, కంప్యూటర్,సైకిల్,బైక్, కారు లాంటి మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు సేకరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సిపిఓ చిన కోట్యా నాయ, రవి,హిమవర్ష,ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments