Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్

ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ (లీడ్స్ న్యూస్): ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి తగిన సమాచారంతో రావాలని,ఏదయినా మాట్లాడే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన సీఎల్పీ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. బడ్జెట్ సెషన్ కు హాజరయ్యే ముందు తగిన సమాచారంతో రావాలని, ఏది పడితే అది మాట్లాడకూడదని, ఆచితూచి మాట్లాడాలని ఎమ్మెల్యేలకు సీఎం చెప్పారు. ప్రతిపక్షాలను తిప్పుకొట్టే విధంగా ప్రతి ఒక్కరు తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలను కూడా ఆయన సూచించారు. గతంలో తాను, అలాగే బట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉండగా అప్పటి ప్రభుత్వాలు తాము మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వలేదని, కనీసం మైకులు కూడా ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు వాస్తవాలను సభ ముందుంచేటట్టు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం నూతన గవర్నర్ శివ ప్రసాద్ శుక్ల అసెంబ్లీ ఎదురుగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి,శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, పలువురు మంత్రులు తదితరులు గవర్నర్ వెంట విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments