Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedట్రంప్‌ వ్యాఖ్యలను నమ్మలేం: ఇరాన్‌

ట్రంప్‌ వ్యాఖ్యలను నమ్మలేం: ఇరాన్‌

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,లీడ్స్ న్యూస్:

పశ్చిమాసియాలో శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నామని, ఇందులో భాగంగానే యుద్ధాన్ని ఐదు రోజుల నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేమని కొట్టిపారేసింది. ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించే కుట్రగా అభివర్ణించింది. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడంలేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. సమయం చూసి దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇరాన్ పేర్కొంది. ‘మా దాడులకు ట్రంప్ భయపడ్డారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ చిత్తుగా ఓడాయి. చర్చల విషయంలో ఎవరూ మధ్యవర్తిత్వం చేయలేదు. అసలు అమెరికాతో ఎలాంటి చర్చలు జరుగడం లేదు. ట్రంప్ మళ్లీ ఏదో కుట్ర చేయడానికి శాంతి రాగం పాడుతున్నారు’ అని ఇరాన్ అనుమానం వ్యక్తం చేసింది…

RELATED ARTICLES

Most Popular

Recent Comments