Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedగ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత మూల్యాంకనం నిర్వహించాలి

గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత మూల్యాంకనం నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ,లీడ్స్ న్యూస్:
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత,ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నివారణ, ఓడీఎఫ్ స్థిరత్వం,ప్రజా ఆరోగ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఎస్‌జే-స్కోర్ (SJ-SCORE – స్వచ్ఛ జనగామ పారిశుద్ధ్యం టాస్క్ ఫోర్స్) పేరిట నెలవారీ సమగ్ర మూల్యాంకన విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ బెన్షాలోంతో కలిసి అయన (SJ-SCORE – స్వచ్ఛ జనగామ పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి నెల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆధారాలతో కూడిన 100 మార్కుల విధానంలో మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఈ విధానం పూర్తిగా ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రతి ఇంటి నుంచి తడి,పొడి,శానిటరీ అలాగే ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలను నాలుగు వర్గాలుగా వేరు చేసి సేకరించే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం,చెత్తను కాల్చడం (లేదా) పూడ్చి పెట్టడం నిషేధిత చర్యలని, అలా చేస్తే చర్యలు తప్పవు అన్నారు. మురుగు కాలువలు ఎప్పటికప్పుడు స్వేచ్ఛగా ప్రవహించేలా ఉండాలని, నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజు తాగునీటికి క్లోరినేషన్ చేపట్టి, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఓవర్‌ హెడ్ ట్యాంకుల పరిశుభ్రత, పాఠశాలలు,అంగన్‌వాడీలు, ప్రజా మరుగుదొడ్లు,మార్కెట్లు, కాలనీల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్, డ్రై డే నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయం పరిశుభ్రత పర్యవేక్షణ చేయాలని,వారాంత పరిశుభ్రత ప్రణాళికను అమలు చేయాలని, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పర్యవేక్షించాలని,పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు అందించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఆలస్యం కాకుండా చెల్లించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జనగామ,ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓలు గోపీరామ్,కిరణ్ ప్రకాష్, డీఆర్డీఓ భాస్కర్,పీడీ ఈజేఎస్ సూరి, డిపీఓ వెంకట్ రెడ్డి, జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఈవోలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular