Wednesday, October 28, 2026
No menu items!
HomeUncategorizedకత్తి పోటు కలకలం

కత్తి పోటు కలకలం

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామం వద్ద మంగళవారం రఘునాథపల్లికి చెందిన పర్వతం అర్జున్ అనే యువకుడిపై తన బావ కత్తితో దాడి చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. రఘునాథపల్లికి చెందిన అర్జున్‌ తన బావ అయిన సిరిగిరి రాజ్ కుమార్ తో కలిసి గోవర్ధనగిరికి వెళ్లి ఇరువురు అక్కడ మద్యం సేవించారు. అనంతరం రాజ్ కుమార్ అర్జున్‌ను కత్తితో కడుపులో పొడిచి పరారయ్యాడు. కత్తిపోటుతో తీవ్రంగా గాయపడిన అర్జున్‌ను కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజిఏంకు తరలించారు.వీరి మధ్య పాత కక్షలు ఉన్నట్లు సమాచారం. అర్జున్ తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రఘునాథపల్లి ఎస్ఐ నరేష్ యాదవ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular