Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedనేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్ళనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు,పార్టీ పరమైన కీలక అంశాల నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి సీఎం ఢిల్లీకి చేరుకుంటారు. సోమవారం ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మంగళవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ, సీఈసీ రాజీనామాపై పోరాటం,అలాగే పలు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై ఈ సీబ్ల్యూసీ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు,సీనియర్ జాతీయ నేతలు హాజరుకానున్నారు. అనంతరం తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు,రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత విషయాలపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular