Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedలోవోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

లోవోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

📰 Generate e-Paper Clip

కడియం శ్రీహరి

స్టేషన్ ఘనపూర్‌కు 8 కొత్త సబ్ స్టేషన్లు

ఇప్పటికే 4 పూర్తి

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్ :గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామంలో నూతనంగా రూ. 2.45 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యలను శాశ్వతంగా అధిగమించడానికి 8 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్లను మంజూరు చేసుకుని, 4 సబ్ స్టేషన్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. మిగిలిన 4 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు కూడా చివరి దశలో ఉన్నాయని, వాటిని కూడా వేగంగా పూర్తి చేసి అతి త్వరలోనే ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రఘునాథపల్లి మండల కేంద్రంలోని 33/11 కే వి సబ్ స్టేషన్ ను 230 కె.వి సబ్ స్టేషన్ గా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చాను. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపడమే తన ధ్యేయమని,మౌలిక వసతుల కల్పనలో భాగంగా పతేశాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో రూ.30 కోట్లతో నిర్మించిన సిసి రోడ్లను కూడా ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలోజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు,స్థానిక సర్పంచ్ లు పోకల శ్రీనివాస్, అక్కినేపల్లి సుజాత మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి,లింగాజీ, మండల పార్టీ మాజీ అధ్యక్షులు కోళ్ల రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధ్యక్షుడు భాస్కర్ పలు గ్రామాల పార్టీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular