పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు
దోచుకున్న డబ్బును పేదలకు పంచండి
మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
లీడ్స్ న్యూస్,ప్రతినిధి,రవి కొలుపుల:
పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలక్ట్రోరల్ బాండ్స్ తో సంపాదించుకున్న కోట్లాది రూపాయల డబ్బును పేదలకు పంచాలని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు. ఆదివారం తన నియోజకవర్గంలోని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘కొందరు రాష్ట్ర ప్రభుత్వం పైన,కాంగ్రెస్ పార్టీపైన,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పదే పదే విమర్శలు చేస్తున్నారు.. అంతే కాకుండా సోషల్ మీడియాలో రోజు ఒక నెగటివ్ వార్త పోస్ట్ చేయడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నారు.. అధికారం కోల్పోయిన బిఆర్ఎస్,అధికారం కోసం ఆశ పడుతున్న బీజేపీలు ప్రజా పాలన పైన,కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరికాదన్నారు’, ‘నేను ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసిఆర్, హరీష్ రావు,కేటీఆర్,సంతోష్ రావులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఆస్తులను కూడా కట్టుకున్నారని,బ్రహ్మాండంగా ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలు కేసీఆర్ కూతురే స్వయంగా ఆరోపణలు చేస్తుందని,ఆమె మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల అఫిడవిట్లో కేసిఆర్ తనకు ఎకరం భూమి కూడా లేదని ఇచ్చారు కదా, 2014లో లేని భూములు, వేల కోట్ల ఆస్తులు ఈ పదేళ్లలో ఎక్కడి నుంచి వచ్చాయని? అడుగుతున్నట్లు చెప్పారు. ‘కోట్ల రూపాయల డబ్బు మీ దగ్గర ఉందని, కేసీర్ కెసిఆర్ కూతురు కవిత అంటున్న సంగతి కూడా ఆయన గుర్తు చేస్తున్న, ‘బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు,వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు,పనులు చేసి ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనిపించి కోట్లాది రూపాయలు పోగేసుకున్నారని అయన అన్నారు’. మీకు తెలంగాణ పైన ప్రేమ ఉంటే,ఉద్యమకారుల పైన ప్రేమ ఉంటే, పార్టీ ఫిక్స్ డిపాజిట్ లో ఉన్న రూ.1400 కోట్లను తెలంగాణ ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టున్నారని, సోనియా గాంధీ చలించిపోయి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా, ఇంకా ఒక్క ప్రాణం కూడా బలి కావద్దని బాధపడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు అధికారంలోకి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారా? అని బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు ఒకరిని గెలిపిస్తే,చిల్లర మాటలు,చిలిపి చేష్టలతో పూర్తిగా వెనుక పడేశారని అన్నారు. గడిచిన మూడేళ్లలో 1600 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని,పనిచేసేవారిని పనిచేయని, వారిని ఒకే రకంగా చూడొద్దని ఆయన ప్రజలను కోరారు,రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా,వేరే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ఆదరించాలని అయన కోరారు. నాడు దేవాదులకు తానే పురుడు పోశానని,ఆనాటి దేవాదుల ప్రాజెక్టు ద్వారానే మనకు ఈనాడు సాగు, తాగునీరు వస్తుందని చెప్పారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం పాటు పడతానని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇబ్రహీంపురం పెద్ద చెరువు మత్తడి పోస్తూ వృధాగా పోతున్న నీటిని నవాబుపేట రిజర్వాయర్ కు మళ్ళించడం తనకు ఎంతో తృప్తిగా ఉందన్నారు. ఇదంతా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేశానని, ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆరు జోడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదే మహేందర్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
