Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedవిజయవంతమైన రక్తదాన శిబిరం

విజయవంతమైన రక్తదాన శిబిరం

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో స్థానిక వెలుగు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం విజయవంతం అయింది. క్యాన్సర్,రక్తదానంపై అవగాహన కలిగిస్తూ వెలుగు యూత్ సొసైటీ సభ్యులు రెడ్ క్రాస్ సంస్థతో కలిసి ఈ మెగా శిబిరాన్ని నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. ఉదయం 9 గంటల నుండి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేశారు. మధ్యాహ్నం వరకు మొత్తం 40 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సాయంత్రనికి ఇదీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో వెలుగు అధ్యక్షులు గండికోట రవీందర్, ఉపాధ్యక్షులు యాకస్వామి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్,సంయుక్త కార్యదర్శి సుమన్,నూనె రాజు,ఎండీ.పాష,పల్లపు మురళి,గండికోట మహేందర్,సాంబ రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular