లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి మండలంలోని పలు వ్యవసాయ బావుల బోరు మోటర్ల వైర్లను దొంగిలిస్తున్న నలుగురు వ్యక్తులను రఘునాథపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై నరేష్ యాదవ్ తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన గంట రాజు,శీలం మహేష్, రాజీవ్ నగర్ కు చెందిన మిద్దెల శ్రీను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన కావడి సంజీవరాజు ఉన్నారు. వీరి నుండి 25 కిలోల కాల్చిన కాపర్ వైర్, రెండు మోటార్ సైకిళ్ల ను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
