Monday, October 26, 2026
No menu items!
HomeUncategorizedసైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

వరంగల్ సీపీ ఎన్. శ్వేత

లీడ్స్ న్యూస్ ప్రతినిధి / కొలుపుల రవి రోజురోజుకు జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ నెలను సైబర్ మోసాలపై అవగాహన కల్పించే నెలగా ప్రకటించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు. ఫోన్ కాల్స్, SMSలు,వాట్సాప్ప్ మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, అనుమానాస్పద లింకులు వచ్చినప్పుడు వాటిని వెంటనే ఓపెన్ చేయకుండా “ఆగండి… ఆలోచించండి… ధృవీకరించండి” అనే విధానాన్ని పాటించాలని తెలిపారు. KYC, బ్యాంక్ ఖాతా బ్లాక్, లాటరీ,ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులపై భారీ లాభాలు వంటి పేర్లతో వచ్చే మోసపూరిత కాల్స్,సందేశాలను నమ్మవద్దని సూచించారు. ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ డిస్కౌంట్లు,అతి తక్కువ ధరల పేరుతో వచ్చే నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని,కొనుగోలు చేసే ముందు వెబ్‌సైట్ URL, విక్రేత వివరాలను ధృవీకరించుకోవాలని తెలిపారు. OTP, UPI PIN, ATM/డెబిట్ కార్డు లాంటి వివరాలు, CVV, PIN, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ షేర్ చేసుకోరాదని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని స్పష్టం చేశారు. అత్యవసరంగా డబ్బును పంపాలని ఒత్తిడి చేసే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు కాల్ చేసి,cybercrime.gov.inలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ పోస్టర్లను ఆమె ఎన్.శ్వేత ఆవిష్కరించారు. అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, కమీషనరేట్ ఏఓలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular