Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedఅదుపుతప్పిన కారు

అదుపుతప్పిన కారు

📰 Generate e-Paper Clip

ఏడుగురికి తీవ్ర గాయాలు

లీడ్స్ న్యూస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి సమీపంలో వరంగల్ వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ కు అవతలి వైపు రోడ్డులో హైదరాబాద్ వైపు వెళుతున్న మరో కారుపై పడింది. దీంతో హైదరాబాద్ మలక్పేటకు చెందిన ఏడుగురు ముస్లిం యువకులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.108 ద్వారా జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇక్దార్ హుస్సేన్,హిస్మాన్, అజ్రాన్,అర్హాన్,ఇమాద్,ముబాష్,అఫ్రాన్ అనే ఏడుగురు యువకులు ఉన్నారు. వీరంతా 22 ఏళ్ల లోపు వారే. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని రఘునాథపల్లి ఎస్సై భరత్ సందర్శించినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular