Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedఫ్లెక్సీల పై మున్సిపల్ అధికారుల కొరడా

ఫ్లెక్సీల పై మున్సిపల్ అధికారుల కొరడా

📰 Generate e-Paper Clip

ఒక్కరోజే రూ. 87 వేల ఆదాయం

లీడ్స్ న్యూస్, జనగామ, స్థానిక మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీల పై కొరడా జులుపించారు. అనుమతి లేకుండా పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పై పన్ను వసూలు చేశారు. ఇకపై మున్సిపాలిటీ పరిధిలో ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి సూచించారు. గత రెండు రోజులుగా మున్సిపల్ సిబ్బంది ప్లెక్సీల ఏర్పాటుపై దృష్టి సారించి సదర్ యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే వారు ఇకపై తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యేకు నోటీసు

జనగామ పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు వద్ద నోమాలయ వెంచర్ యజమాని, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ల పై రూ.10,000/- పెనాల్టీ విధించారు. అలాగే ఆర్టిఏ మెంబర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిలువేరు అభి గౌడ్ నుండి కూడా రూ. 1000/- జరిమానా వసూలు చేశారు. మీరే కాకుండా పట్టణంలో ఆయాచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై దృష్టి సారించి పన్ను వసూలు చేస్తున్నారు. గత రెండు రోజుల్లో మున్సిపల్ అధికారులు రూ. 87000/- పైచిలుకు పన్నులు వసూలు చేశారు. ఇకపై ప్లెక్సీ ప్రింటింగ్ యజమానులు కూడా ఫ్లెక్సీ ముద్రణ తేదీని, ప్రింటింగ్ ప్రెస్ పేరును స్పష్టంగా కనిపించేలా సదరు బ్యానర్లపై ప్రింట్ చేసి పెట్టాలని కమిషనర్ సూచించారు. దీంతో విచ్చలవిడిగా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఏర్పాటయ్యే ఫ్లెక్సీలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. మున్సిపల్ ఆక్ట్ 2019 అనుసరించి అధికారులు ఈ రకమైన వస్తువులకు పూనుకున్నారు. ఇకపై గ్రామాల్లో కూడా ఇదే తరహా దాడులు ఉండవచ్చునని భావిస్తున్నారు. చూడాలి మరి అధికారులు ఇలాగే కఠినంగా వ్యవహరిస్తారా? చూసి చూడనట్లుగా ఉంటారా అనేది.

RELATED ARTICLES

Most Popular