Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedఏసీబీకి పట్టుబడ్డ సిడిపిఓ

ఏసీబీకి పట్టుబడ్డ సిడిపిఓ

📰 Generate e-Paper Clip

జగిత్యాల,లీడ్స్ న్యూస్: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని సిడిపిఓ పద్మ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఆ సెక్టర్ లోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000 చొప్పున మొత్తం రూ.63,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 26న ఫిర్యాదుదారుడి నుంచి ఆమె కార్యాలయ ఆవరణ వెలుపల రూ.63,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీవో పద్మను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఎస్‌పీఈ,ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular