Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedకౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

📰 Generate e-Paper Clip

రఘునాథపల్లి, లీడ్స్ న్యూస్: శాసనసభలో కడియం శ్రీహరి పట్ల పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన అభ్యంతరకర తీరుకు నిరసనగా సోమవారం మద్యాహ్నం రఘునాథపల్లి అండర్ బ్రిడ్జి వద్ద కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ గొరిగే రవిలు మాట్లాడుతూ..కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ నుండి కూడా తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ల రవి,నాయకులు గాదే మహేందర్ రెడ్డి,మాసంపల్లి లింగాజి,నామాల బుచ్చయ్య,పోకల శివకుమార్,ఎండి. బాషుమియా,మాజీ న్సర్పంచు పోకల శివ కూమర్,ఆరూరి శ్రీనివాస్,జేరిపోతుల మహేందర్, నిడిగొండ, కోమల్ల,ఎస్.కె తండా, మండెల గూడెం గ్రామ సర్పంచులు బొమ్మ వీరస్వామి,వల్లాల అశోక్, ఈర్య నాయక్, డేగల రాజశేఖర్,సింగిరెడ్డి శ్రీనివాస్,కావట్టి భాస్కర్, పగిడిపల్లి కృష్ణ,బాల్ రెడ్డి,కొంకీస ప్రకాష్ రెడ్డి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments