
లీడ్స్ న్యూస్,జనగామ: జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ కు ఐపీఎస్‌గా కన్ఫర్డ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పోస్టులైన గ్రూప్ -1 ద్వారా నియామకం అయిన రెవెన్యూ,పోలీస్ అధికారులకు ఐఏఎస్,ఐపీఎస్ లుగా వారి సర్వీస్ ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేంద్రానికి పదోన్నతి కోసం ప్రతి పాదనలు పంపుతుంది. అనంతరం కేంద్రం వారికి ఐఏఎస్,ఐపీఎస్ హోదాను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ కు ఐపీఎస్ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు తాజాగా జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ లను శుక్రవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించారు. ఐపీఎస్ అధికారిగా పదోన్నతి పొందిన జనగామ డిసిపి రాజమహేంద్ర నాయకును జిల్లాకు చెందిన పలువురు పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు,జర్నలిస్ట్ లు, ప్రజలు సంఘాల నాయకులు ఈ సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

