Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorized'నీట్ ' ప్రశాంతం

‘నీట్ ‘ ప్రశాంతం

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు. ఇందు కోసం జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలో సెంటర్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ పెంబర్తి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి పరీక్ష నిర్వాణ,సీసీ కెమెరాలు,బయోమెట్రిక్ పని తీరు విధానాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఇన్విజిలేటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలు తప్పక పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇతరులను ఎవరిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించ కూడదని ఆదేశించారు. మొత్తం మీద ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆర్డీఓలు గోపీరాం,వెంకన్న,ఏసీపీ అంబటి నర్సయ్య, రఘునాథపల్లి రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి,నీట్ అధికారులు తదితరులు పరీక్షలను పర్యవేక్షించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments