Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorized70 మందితో జంబోజెట్ జిల్లా కమిటీ

70 మందితో జంబోజెట్ జిల్లా కమిటీ

📰 Generate e-Paper Clip

మహిళలకు దక్కని ప్రాధాన్యత

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతీ సహా 70 మంది సభ్యులు ఉన్నారు. ఇది ఒక రకంగా జంబో జెట్ కమిటీగా చెప్పొచ్చు. పార్టీని అంటిపెట్టుకొని ఉండి, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారితో పాటుగా కొత్తగా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వారికి కూడా వారి రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ జిల్లా కమిటీలో ప్రాధాన్యత కల్పించింది. దీంతో సభ్యుల సంఖ్య భారీగా చేరింది. మొత్తం 70 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో నలుగురు మహిళలకు ప్రాధాన్యత దక్కినట్లు అయింది. మరి కొంతమంది మహిళలకు అవకాశం ఇస్తే బాగుండేదని పలువురు అంటున్నారు. 33% రిజర్వేషన్ ఉండాలనుకున్న మహిళలకు కనీసం ఆ మేరకు ప్రాధాన్యత కల్పించాల్సి ఉండేదని అ లెక్కన 26 వరకు సభ్యులు ఉండాలని పలువులు అంటున్నారు. నూతన జిల్లా కమిటీలో ఏడుగురికి ఉపాధ్యక్షులుగా,14 మందికి జనరల్ సెక్రెటరీగా ముగ్గురికి స్పోక్స్ పర్సన్ గా 21 మందికి సెక్రెటరీలుగా, 23 మంది సభ్యులుగా చోటు దక్కింది. అలాగే యువజన కాంగ్రెస్ కు కూడా మంచి ప్రాధాన్యత దక్కింది. అయితే కొందరు సీనియర్లకు,ముదురు కాంగ్రెస్ నేతలను పక్కనపెట్టి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. అంతే కాదు ఇప్పటికే ఉన్న పదవిలోనే కొనసాగిస్తూ తిరిగి చోటు కల్పించారు. నూతన కమిటీ లో మాజీ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డికి పూర్వం ఉన్న హోదాలోనే కొనసాగించింది. కొత్తగా ఉడుత రవికి ఉపాధ్యక్షుడిగా,కడియం వెంట టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన గుడి వంశీధర్ రెడ్డికి ఉపాధ్యక్షుడిగా,నామాల బుచ్చయ్యకు కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఎన్.ఎస్.యుఐ నుండి జనగామలో క్రియ శీలకంగా పనిచేస్తున్న వేణు మాధవ్ ను స్పోక్స్ పర్సన్, అలాగేమేడే శ్రీనుకు జిల్లా కమిటీలో అవకాశం కల్పించారు. రఘునాథపల్లి,లింగాల ఘనపూర్, జనగామ,మండలాకు మంచి ప్రాధాన్యత లభించిందని కమిటీనిబట్టి స్పష్టమవుతుంది. మరికొంత మంది క్రియాశీల కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పటికీ మండలాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో జిల్లా కమిటీ చోటు కల్పించలేదని తెలుస్తుంది. జిల్లా కమిటీల అనంతరం మండల కమిటీల ఏర్పాటు జరిగితే కూర్పు పై ఒక స్పష్టత వస్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments