Saturday, June 27, 2026
No menu items!
HomeUncategorizedపనులన్నీ వారంరోజుల్లో పూర్తి చేయాలి

పనులన్నీ వారంరోజుల్లో పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ,లీడ్స్ న్యూస్ : వారం రోజుల్లోగా జిల్లాలో అన్ని గ్రామాలు మండలాల్లో వనమహోత్సవాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ గా ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో ఆయన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని దాన్ని కాపాడుకునేందుకు విధంగా కూలీలకు పనులు కల్పించి చేపట్టాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం వాటిపై కూడా అధికారంలో దృష్టి సారించాలని, గ్రామాల్లో వీధిలైట్లు ఆన్ ఆఫ్ పై దృష్టి పెట్టి పవర్ ను సేవ్
చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే వరంగల్ జాతీయ రహదారిపై రఘునాథపల్లి మండల పరిసరాల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై అధికారులు దృష్టి సారించి వాటిని నివారించేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, రోడ్లపై నిలవకుండా చూడడం వంటివి చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా మత్తు పదార్థాల నివారణకు జిల్లా అధికారులకు కృషి చేయాలని ముఖ్యంగా పోలీసులు వైద్య శాఖ అధికారులు దీనిపై దృష్టి సాధించాలన్నారు. ఈ సమావేశాల్లో డిసిపి రాజమహేంద్ర నాయక్, జిల్లా కు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments