
లీడ్స్, రఘునాథపల్లి: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో రఘునాథపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ముసిపట్ల విజయ్,బొల్లం రాజీవ్,లోకుంట్ల సృజన్, ఎడ్ల బాలరాజు,దుబ్బాక హరీష్,,శాగా అశోక్,పెర్నె ప్రసాద్,ముసిపట్ల రాజు, ముసిపట్ల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
