Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedసీఎం రేవంత్ సహా 230 ప్రయాణికులు సేఫ్

సీఎం రేవంత్ సహా 230 ప్రయాణికులు సేఫ్

📰 Generate e-Paper Clip

గాల్లో చెక్కర్లు కొట్టిన విమానం

లీడ్స్ న్యూస్, హైదరాబాద్: ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే 6E717 ఇండిగో ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అయితే ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఈ విమానం నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో ఢిల్లీ నుండి శంషాబాద్ కు చేరుకుంది. ఆ సమయంలో శంషాబాద్ ఏటీఎఫ్ అధికారులు ఆ విమానానికి సిగ్నల్ ఇవ్వకపోవడంతో అది రన్ వే పై ల్యాండింగ్ అయినట్టే అయి, ఆ వెంటనే టేక్ ఆఫ్ అయి కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ అవ్వాల్సిన విమానం మళ్ళీ ఎందుకు ఎగిరిందో తెలియక ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా ఆందోళన గురైనట్లు సమాచారం. సాంకేతిక కారణాల రీత్యా ఏమైనా జరిగి ఉంటే ఘోరం జరిగి ఉండేదని అందరు ఊపిరి పీల్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular