ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
లీడ్స్ న్యూస్, హైదరాబాద్: ఆలేరు నియోజకవర్గంలోని యాదాద్రి,ఆలేరు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చా. అసెంబ్లీలో ఈ రోజు ఆయన ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుతూ యాదగిరిగుట్ట దేవాలయానికి రోజుకు లక్ష మంది భక్తులు వస్తున్నారని గుట్ట మున్సిపాలిటీకి నిధులు కేటాయించాలని అన్నారు. యాదగిరిగుట్ట గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు దేవాదాయ శాఖ ఆదాయం నుండి 30 శాతం గ్రామపంచాయతీకి వచ్చేవని, అలాగే ఇప్పుడు మునిసిపాలిటీకి కూడా దేవస్థాన ఆదాయం నుండి ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. అలాగే 200 షాపుల నిర్వాహకుల ఉపాధికి ఇబ్బందికరంగా మారిన బ్రిడ్జిని తొలగించాలని, ఆలేరును రెవెన్యూ డివిజన్ గా మార్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన అభిప్రాయాన్ని ఉమ్మడి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బలపరిచారు.
