జనగామ,లీడ్స్ న్యూస్: కలెక్టరేట్లో వరంగల్ ఎంపీ,దిశ కమిటీ చైర్మన్ కడియం కావ్యను నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి మంగళవారం చేనేత శాలువాతో సత్కరించి సమస్యలపై వినతి పత్రం అందించారు. జనగామలో ఏటిసి శంకుస్థాపన,ఇంజనీరింగ్ కాలేజ్,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్,కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు మంజూరును కోరారు. దిశ కమిటీ సభ్యులు శ్రీనివాస్, సబ్బం పరమేష్,బిరు సిద్ధి లింగం ఉన్నారు.
