Wednesday, August 26, 2026
No menu items!
HomeUncategorizedసమాజంలో మీడియా పాత్ర కీలకమైనది

సమాజంలో మీడియా పాత్ర కీలకమైనది

📰 Generate e-Paper Clip

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్):నేటి సమాజంలో పత్రికల పాత్ర ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం జనగామ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ‘క్యాపిటల్ ఇన్ఫర్మేషన్’ ఇంగ్లీష్ దినపత్రిక క్యాలెండరును తెలుగు సంవత్సరాది ‘పరాబవ’ ఉగాది సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ప్రతినిధులు కొలుపుల రవి, భూస రమేష్ ల నేతృత్వంలో ఈ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ సమాజంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ దిన పత్రిక గత 26 సంవత్సరాలుగా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. జర్నలిస్టుల అభ్యున్నతికి ఎల్లప్పుడు తన సహకారం అందిస్తానని,క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ పత్రిక మరింత కాలం ఇలాగే ప్రజల పక్షాన సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, స్థానిక జర్నలిస్టు యూనియన్ నాయకులు కొత్త పెళ్లి కిరణ్, సురిగల బిక్షపతి,వినయ్,ఉపేందర్, రేవంత్,ఆనంద్, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి,గణేష్, మధు, మనీ,కుంభం రమేష్,మంచికట్ల రాజేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular