Wednesday, October 28, 2026
No menu items!
HomeUncategorizedప్రజల సహాకారం మరువలేను

ప్రజల సహాకారం మరువలేను

📰 Generate e-Paper Clip

సిఎస్బి సీఐ. ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ రూరల్ సర్కిల్ రఘునాథపల్లి ప్రజలు అందించిన సహకారం తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఇటీవల వరంగల్ సిఎస్బికి బదిలీ అయిన సిఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయనకు గురువారం స్థానిక పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు,ప్రజాప్రతినిధులు,పోలీస్ ఉన్నతాధికారులు,సిబ్బంది అందరూ ఎంతో సహకారం అందించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కొత్తగా రఘునాథపల్లిలో చార్జ్ తీసుకున్న సీఐ జి.వేణు, ఎస్సై లు నరేష్ యాదవ్, శ్రవణ్ కుమార్ లు శాలువాలు,పూలమాలలు,మెమొంటోలతో శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అయితే ఉద్యోగికి బదిలీ అనేది తప్పదని, ప్రజలు అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. ఆయన రఘునాథపల్లి సర్కిల్‌కు అందించిన విశిష్ట సేవలను, ఆయనతో కలిసి పనిచేసిన మధురమైన అనుభవాలను, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తూ ప్రత్యక్షంగా నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను ఎస్సైలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత,క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు సిబ్బందికి అందించిన సహకారం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వారు అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు,విజయాలు,మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ అయన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular