Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedమున్సిపల్ అధికారిపై చర్య తీసుకోండి

మున్సిపల్ అధికారిపై చర్య తీసుకోండి

📰 Generate e-Paper Clip

టెండర్లలో అక్రమాలు జరిగాయని కలెక్టర్ కు ఫిర్యాదు

లీడ్స్ న్యూస్,ప్రతినిధి/కొలుపుల రవి: జనగామ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దపహాడ్ గ్రామానికి చెందిన ఓర్సు మహేందర్ సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. బతుకమ్మ సంబరాల దృష్ట్యా జనగామ పట్టణంలో రూ. 7 లక్షలతో చేపట్టాల్సిన టైటింగ్ తదితర పనులకు మున్సిపల్ అధికారులు ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. కాగా,మహేందర్ ఒక్కరే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపాడు. అన్ని అర్హతలు ఉన్న తనకు ఈ టెండర్ రావాల్సి ఉందని ఆయన చెప్పారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఆ టెండర్ ను తనకు కేటాయించకుండా వేరే వ్యక్తికి కేటాయించారని ఆయన ఆరోపించాడు. దివ్యాంగుడివైన తన వల్ల ఈ పని చేయడం సాధ్యం కాదని, వేరే వాళ్లకు కేటాయించినట్లు మున్సిపల్ డీఈ రాజ్ కుమార్ తనతో  చెప్పాడని మహేందర్ ఆరోపిస్తున్నాడు. తనకు పని కేటాయించక పోయిన పర్వాలేదు కానీ,తన శారీరక వైఖల్యాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన డీఈపై చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మున్సిపల్ డిఈ రాజ్ కుమార్ ను ‘ లీడ్స్ న్యూస్ ‘ ప్రతినిధి వివరణ కోరగ వ్యక్తిగతంగా మహేందర్ ను ఉద్దేశించి తాను అలా మాట్లాడలేదని, ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. అయితే, గతంలో మహేందర్ మున్సిపల్ పనులను దక్కించుకుని సరిగా చేయలేదని డీఈ వివరించారు. ఈ వివాదంపై కలెక్టర్ చొరవ తీసుకొని పరిష్కరించాలని మహేందర్ కోరారు. ఇదిలా ఉండగా వికలాంగుల సమైక్య రాష్ట్ర నాయకుడు మేకల సమ్మయ్య డీఈ తీరును సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు.

RELATED ARTICLES

Most Popular