బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూరి అజయ్

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: బోడుప్పల్ లోని న్యూ భవానినగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ హామీ ఇచ్చారు. ఆదివారం న్యూ భవాని నగర్ లో విగ్నేశ్వర మండపం వద్ద స్థానికులు మహా అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా అజయ్ హాజరై మాట్లాడారు. కమ్యూనిటీ హాల్ తో పాటుగా పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లు కూడా పూర్తి చేస్తానని చెప్పారు. ప్రతి ఏటా కాలనీలో విగ్నేశ్వర నవరాత్రులను ఘనంగా నిర్వహించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్,మాజీ కార్పొరేటర్లు రాసాల వెంకటేష్,బిజెపి నాయకులు సామాల పవన్ రెడ్డి,తలారీ రవి యాదవ్, రామచంద్రం యాదవ్,బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, భవానినగర్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, సెక్రెటరీ పి.సైదులు,గౌరవ సలహా దారుడు కొలుపుల మల్లేష్,కె.వి మల్లేష్ యాదవ్, టి.వీరయ్య,ఎస్.సంతోష్ కుమార్, వి.గోపాల్ రెడ్డి,ఎస్ వీరయ్య,విష్ణు,భరత్ పాల్గొనగా 1000 మందికి పైగా భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

