Sunday, October 25, 2026
No menu items!
HomeUncategorizedగడ్చిరోలిలో మావోయిస్టుల డంప్

గడ్చిరోలిలో మావోయిస్టుల డంప్

📰 Generate e-Paper Clip

భారీగా రాకెట్ లాంచర్లు, తుపాకులు, పేలుడు సామాగ్రి

లీడ్స్ న్యూస్/హైదరాబాద్ : మహారాష్ట్రలోని నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు భారీ కుట్రను భగ్నం చేశాయి. భామ్రాగడ్ సబ్ డివిజన్ పరిధిలోని కోపర్షి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ ఆయుధాలు,పేలుడు పదార్థాల డంప్ను గడ్చిరోలి పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. భద్రతా బలగాలే లక్ష్యంగా అడవుల్లో నక్సలైట్లు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు,మారణాయుధాలను దాచిపెట్టారు. అయితే నిఘా వర్గాల సమాచారంతో అక్టోబర్ 6న ప్రత్యేక ఇందుకోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. స్పెషల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (SOS),బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) సంయుక్తంగా కోపర్షి అడవుల్లో క్షుణ్ణంగా కూంబింగ్ నిర్వహించి,భూగర్భంలో దాచిన ఈ భారీ డంపును వెలికితీశాయి. ఈ సంయుక్త ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలు మూడు రాకెట్ లాంచర్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, రెండు 12-బోర్ రైఫిళ్లు, మూడు 12-బోర్ లైవ్ కాట్రిడ్జ్లు, 10 డిటోనేటర్లు, 150 మీటర్ల కేబుల్ వైర్, 9 మ్యాగజైన్లు, 10 కుక్కర్లు (ఐఈడీల తయారీకి వాడేవి), 5 వాకీటాకీలు, 12 వాకీటాకీ ఛార్జర్లు సహా పలు మావోయిస్టు సంబంధిత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం ముందస్తు రక్షణ చర్యలు,ప్రామాణిక నిబంధనల ప్రకారం లభ్యమైన పేలుడు పదార్థాలను బీడీడీఎస్ సిబ్బంది అక్కడికక్కడే బాంబు నిర్వీర్య ప్రక్రియ చేపట్టి సురక్షితంగా పేల్చివేశారు. దీంతో పోలీసు భద్రతా బలగాలే లక్ష్యంగా జరగాల్సిన పెను ముప్పు తప్పిపోయింది.

RELATED ARTICLES

Most Popular